సోమవారం 01 మార్చి 2021
Business - Feb 03, 2021 , 17:31:59

ఐటీ రిట‌ర్న్స్ మిన‌హాయింపులిలా.. బ‌ట్ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి?!

ఐటీ రిట‌ర్న్స్ మిన‌హాయింపులిలా.. బ‌ట్ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి?!

న్యూఢిల్లీ: ప‌్ర‌తియేటా పార్ల‌మెంట్‌కు ఆర్థిక మంత్రి వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించ‌డానికి ముందు, త‌ర్వాత వేత‌న జీవులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు స‌మ‌ర్పించే ఐటీ రిట‌ర్న్స్‌లో మిన‌హాయింపుల‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ ఏడాది కూడా కొన్ని సెక్టార్ల‌వారికి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మిన‌హాయింపులు ఇచ్చారు. కానీ ఆయా మిన‌హాయింపుల‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని తెలుస్తోంది. 

ఉదాహ‌ర‌ణ‌కు 75 ఏండ్లు దాటిన సీనియ‌ర్ సిటిజ‌న్లకు వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐటీ రిట‌ర్న్స్ ఫైలింగ్ నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అయితే, స‌ద‌రు సీనియ‌ర్ సిటిజ‌న్ రిటైర్డ్ ఉద్యోగి/ అధికారి అయి ఉండ‌టంతోపాటు ఒకే బ్యాంక్ ఖాతాలో పెన్ష‌న్ జ‌మ అవుతుంటే మాత్రం ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌న‌వ‌స‌రం లేదు. ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు క‌లిగి ఉన్న వారికి, పెన్ష‌న్ మిన‌హా బ్యాంకుల్లో జ‌మ అయిన మొత్తంపై మాత్రం ఐటీ మిన‌హాయింపులేదు. 

ఒక వ్య‌క్తి ఆస్తుల క్ర‌య‌, విక్ర‌యాల్లో స్టాంప్ డ్యూటీకి అనుగుణంగా ఐటీ మిన‌హాయింపులు ఉంటాయి. 2013లో స్థిరాస్తి వాస్త‌వ విక్ర‌య విలువ... ఐదు శాతం స్టాంప్ డ్యూటీ కంటే త‌క్కువ‌గా ఉంటే మిన‌హాయింపులు ఉండేవి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో స్టాంప్ డ్యూటీ లిమిట్‌ను 10 శాతానికి పెంచారు. సోమ‌వారం ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో దాన్ని 20 శాతానికి విస్త‌రించారు.  అయితే, 20 శాతం స్టాంప్ డ్యూటీ మిన‌హాయింపు ప‌రిమిత‌మైన లావాదేవీల‌కు మాత్ర‌మే వ‌ర్తింప‌జేశారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 12 నుంచి.. వ‌చ్చే జూన్ 30 వ‌ర‌కు తొలిసారి రెసిడెన్షియ‌ల్ యూనిట్ అలాట్‌మెంట్‌కు మాత్రం 20 శాతం స్టాంప్ డ్యూటీ లిమిట్ వ‌ర్తిస్తుంది. ఒక ఓన‌ర్ నుంచి ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రం 10 శాతం లిమిట్ మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. 

అలాగే వేత‌న జీవుల ఎల్టీసీ క్యాష్ స్కీమ్ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. వ‌చ్చే ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఎల్టీసీ స్కీమ్‌లో వ‌స్తువులు, ఇత‌ర సేవ‌ల కొనుగోళ్ల‌పై ప‌న్ను య‌ధాత‌థంగా విధిస్తారు. అలాగే వేత‌న జీవులు జ‌మ చేసుకునే ఈపీఎఫ్ మొత్తం రూ.2.5 ల‌క్ష‌లు దాటితే, దాని వ‌డ్డీపై ప‌న్ను విదిస్తార‌న్న విష‌య‌మై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. 2021 ఏప్రిల్ ఒక‌టో తేదీకి ముందు జ‌మ అయిన 2.5 ల‌క్ష‌ల ఈపీఎఫ్ మొత్తం వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుందా? లేదా? అన్న విష‌య‌మై స్ప‌ష్ట‌త లేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo