శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Feb 03, 2021 , 18:44:18

ఈపీఎఫ్ వ‌డ్డీ మీద ప‌న్నుపై కేంద్రం ఏమందంటే?!

ఈపీఎఫ్ వ‌డ్డీ మీద ప‌న్నుపై కేంద్రం ఏమందంటే?!

న్యూఢిల్లీ: ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్‌తో స‌హా వేత‌‌న జీవుల అన్ని ర‌కాల ప్రావిడెండ్ ఫండ్‌ల మీద వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రాంరాం చెప్పారు. ప్రిన్సిపుల్ ఆఫ్ ఈక్విటీ (principle of equity) ఆధారంగా రూ. 2.5 ల‌క్ష‌లు దాటిన ఈపీఎఫ్ మీద వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌సూలు చేస్తామ‌ని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భూష‌ణ్ పాండే ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వేత‌న జీవుల్లో అత్య‌ధికంగా జ‌మ చేసిన మొత్తంపై వ‌డ్డీ ఆదాయానికి ప‌న్ను మిన‌హాయింపునిస్తే, మ‌రో ప‌న్ను చెల్లింపుదారుడిపై భారం ప‌డ‌దా? అని ప్ర‌శ్నించారు. 

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాల‌సీ (యూలిప్స్‌)ల్లో వార్షిక ప్రీమియం రూ.2.5 ల‌క్ష‌లు దాటితే, స‌ద‌రు యూలిప్ పాల‌సీ మెచ్యూరిటీ టైంలో ప‌న్ను విధిస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఈ నెల ఒక‌టో తేదీ నుంచి యూలిప్ పాల‌సీలు కొనుగోలు చేసిన వినియోగ‌దారులంద‌రిపై ఈ ప‌న్ను భారం ప‌డుతుంద‌న్నారు. మ్యూచువ‌ల్ ఫండ్ (ఎంఎఫ్‌)ల్లో పెట్టుబ‌డుల‌కు కూడా ఈ ప‌న్ను వ‌ర్తిస్తుంద‌ని అజ‌య్‌భూష‌ణ్ పాండే వివ‌రించారు. 

ద్ర‌వ్య‌లోటు ఆధారంగా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు రుణ ప‌ర‌ప‌తి రేటింగ్ ఇస్తున్న సంస్థ‌లు త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్ర‌భుత్వ వ్య‌యం, అమ‌లు చేస్తున్న సంస్క‌ర‌ణ‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అజ‌య్‌భూష‌ణ్ పాండే తెలిపారు. ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభం స‌మ‌యంలో రేటింగ్ సంస్థ‌లు 360 డిగ్రీల కోణంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను విశ్ల‌షించాల‌ని సూచించారు. ద్ర‌వ్య‌లోటును మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం స‌బ‌బు కాద‌ని స్ప‌ష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo