మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 31, 2021 , 00:06:53

ఉపాధి హామీకి య‌థాత‌థంగా నిధులు:సీఐఐ విజ్ఞ‌ప్తి... ఎందుకంటే?!

ఉపాధి హామీకి య‌థాత‌థంగా నిధులు:సీఐఐ విజ్ఞ‌ప్తి... ఎందుకంటే?!

న్యూఢిల్లీ: మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ)కు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో మాదిరిగానే వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2021-21)లోనూ నిధులు కేటాయించాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు కాన్ఫిడ‌రేషన్ ఇండియా ఇండ‌స్ట్రీ (సీఐఐ) విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేర‌కు ఆర్థిక మంత్రికి స‌మ‌ర్పించిన ప్రి బ‌డ్జెట్ మెమోరాండంలో కోరింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉపాధి హామీ ప‌థ‌కానికి రూ. ల‌క్ష కోట్లు కేటాయించారు. 2019-20తో పోలిస్తే 2020 అక్టోబ‌ర్ నెల‌లో ఈ ప‌థ‌కం కింద ఉపాధి క‌ల్ప‌న‌కు డిమాండ్ పెరిగింది. 80 ల‌క్ష‌ల ప్ర‌జ‌ల డిమాండ్‌ను అందుకోలేక‌పోయింది. 

ప్ర‌స్తుతం 2.4 కోట్ల మంది ఉపాధి కోసం డిమాండ్ చేయ‌గా, 1.6 కోట్ల మందికి మాత్ర‌మే ప‌ని ల‌భించింది. క‌రోనా నేప‌థ్యంలోనూ 2019 అక్టోబ‌ర్ కంటే 88 శాతం అధికంగా డిమాండ్ వ‌చ్చింది. ఫ‌లితంగా దేశ‌వ్యాప్తంగా ఉపాధి హామీ ప‌థ‌కం కింద రూ.1300 కోట్ల వేత‌నాల‌ను చెల్లించాల్సి ఉంద‌ని గుర్తు చేసింది. వ్య‌వ‌సాయ రంగంలో కోల్డ్ చైన్‌, వేర్ హౌసింగ్‌, లాజిస్టిక్స్‌, ఇరిగేష‌న్‌తో స‌హా మౌలిక వ‌స‌తులను క‌ల్పించ‌డానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించాల‌ని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల‌ను అనుసంధానించ‌డానికి రూర‌ల్ క‌నెక్టివిటీని మెరుగు ప‌ర్చాల్సి ఉంద‌ని సీఐఐ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo