గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 20, 2020 , 23:58:01

బ్రాడ్‌బ్యాండ్‌ ఫ్రీ

బ్రాడ్‌బ్యాండ్‌ ఫ్రీ

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 20: ప్రభుత్వరంగ టెలికం బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వర్క్‌ ఫర్‌ హోమ్‌కు మద్దతుగా ల్యాండ్‌లైన్‌, నూతన వినియోగదారులకు నెలంతా ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. కాపర్‌ కేబుల్‌ ద్వారా కనెక్షన్లు పొందనున్న నూతన కస్టమర్లు ఎలాంటి ఇన్‌స్టాలేషన్‌ చార్జిలు చెల్లించాల్సిన అవసరం లేదని బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ వివేక్‌ బంజల్‌ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కంపెనీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు పొందుతున్న ప్రతి ఒక్కరు నెలపాటు ఉచితంగా సేవలు పొందవచ్చును. నూతన కనెక్షన్‌ కావాలనుకునేవారు ఒక్క కాల్‌ చేస్తే సరిపోతుందని తెలిపారు. 


logo