సోమవారం 08 మార్చి 2021
Business - Jan 21, 2021 , 09:52:25

చ‌రిత్ర సృష్టించిన సెన్సెక్స్‌.. 50 వేల మార్క్ దాటిన సూచీ

చ‌రిత్ర సృష్టించిన సెన్సెక్స్‌.. 50 వేల మార్క్ దాటిన సూచీ

ముంబై: భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు ఇది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉద‌యం తొలిసారి 50 వేల మార్క్‌ను దాటింది. ఉద‌యం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 335 పాయింట్లు లాభ‌ప‌డి ఆల్‌టైమ్ హై 50,126.73 పాయింట్ల‌ను తాకింది. అటు నిఫ్టీ సూచీ కూడా తొలిసారి 14,700 మార్క్‌ను అందుకోవ‌డం విశేషం. గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల దారుణంగా ప‌త‌న‌మై గ‌త మార్చి నెల‌లో 25,638 పాయింట్ల‌కు ప‌డిపోయిన సెన్సెక్స్‌.. ప‌ది నెల‌ల కాలంలోనే అంత‌కు దాదాపు రెట్టింపు కావ‌డం విశేషం. అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ ప్ర‌మాణం చేసిన రోజు అమెరికా మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. ఆ ప్ర‌భావం భార‌త మార్కెట్ల‌పై కూడా ప‌డింది. 

VIDEOS

logo