శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 11, 2020 , 23:36:05

బీఎస్‌ఈ లాభంలో క్షీణత

బీఎస్‌ఈ లాభంలో క్షీణత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్సేంజ్‌లలో ఒకటైన బీఎస్‌ఈ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం తగ్గి రూ.44.93 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇది రూ.50.07 కోట్లుగా ఉన్నది. కంపెనీ ఆదాయం రూ.177.11 కోట్ల నుంచి రూ.148.66 కోట్లకు పడిపోయింది. 


logo