సోమవారం 30 మార్చి 2020
Business - Jan 26, 2020 , 00:23:40

మార్కెట్‌లోకి మారుతి సియాజ్‌ ఎస్‌

మార్కెట్‌లోకి మారుతి సియాజ్‌ ఎస్‌
  • ధర రూ.10.08 లక్షలు
  • బీఎస్‌-6 శ్రేణి ధర రూ.8.31-11.09 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 25: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ శనివారం సియాజ్‌ సెడాన్‌ మోడల్‌లో స్పోర్ట్స్‌ వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. సియాజ్‌ ఎస్‌ పేరుతో ముందుకొచ్చిన ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.10.08 లక్షలుగా ఉన్నది. బీఎస్‌-6 శ్రేణిలో కూడా సియాజ్‌ మోడల్‌ను ఆవిష్కరించగా, దీని ధరల శ్రేణి రూ.8.31 లక్షల నుంచి 11.09 లక్షల మధ్య ఉందని మారుతి తెలిపింది. దేశంలో మితిమీరిన వాతావరణ కాలుష్యం నేపథ్యంలో కర్బన ఉద్గారాలను అదుపులో పెట్టేలా ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 వాహనాలనే విక్రయించాలని కేంద్రం నిబంధన అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. 


logo