ఆదివారం 24 మే 2020
Business - Jan 29, 2020 , 00:41:13

బీఎస్‌-6 శ్రేణిలో బజాజ్‌ సిటి, ప్లాటినా

బీఎస్‌-6 శ్రేణిలో బజాజ్‌ సిటి, ప్లాటినా
  • ప్రారంభ ధర రూ.40,794

న్యూఢిల్లీ, జనవరి 28: బీఎస్‌-6 శ్రేణిలో తమ పాపులర్‌ టూవీలర్‌ మోడల్స్‌ సిటి, ప్లాటినాలను మార్కెట్‌కు పరిచయం చేసింది బజాజ్‌ ఆటో లిమిటెడ్‌. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం బజాజ్‌ సిటి 100సిసి, 110సిసిల ప్రారంభ ధర రూ.40,794గా ఉండగా, బజాజ్‌ ప్లాటినా 100సిసి, 110సిసి హెచ్‌-గేర్‌ ఆరంభ ధర రూ.47,264గా ఉన్నది. కంపెనీ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ రూపొందించిన ఎలక్ట్రిక్‌ ఇంజెక్షన్‌ (ఈఐ) వ్యవస్థతో ఈ కొత్త మోడల్స్‌ కస్టమర్లకు లభించనున్నాయి. బీఎస్‌-6లో ప్లాటినా 100 ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.54,797గా ఉన్నది.


బీఎస్‌-4 శ్రేణి ధర కంటే ఇది రూ.6,368 అధికం. ‘ఈ సరికొత్త మోడల్స్‌తో బీఎస్‌-6 శ్రేణిలోకి బజాజ్‌ ప్రవేశించినైట్లెంది’ అని ఈ సందర్భంగా బజాజ్‌ ఆటో మోటర్‌సైకిల్‌ విభాగం అధ్యక్షుడు సరంగ్‌ కనడే తెలిపారు. త్వరలోనే మిగతా మోడల్స్‌ వాహనాలనూ బీఎస్‌-6 శ్రేణిలో మార్కెట్‌కు పరిచయం చేస్తామన్నారు. ఈఐ వ్యవస్థతో ఇంజిన్‌ పనితీరు మృదువుగా మారుతుందని, మైలేజీ కూడా మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.


logo