గురువారం 04 జూన్ 2020
Business - Mar 28, 2020 , 23:35:29

ఆటో డీలర్లకు ఊరట

ఆటో డీలర్లకు ఊరట

  • బీఎస్‌-4 వాహన అమ్మకాల గడువు 10 రోజులు పొడిగింపు
  • ఢిల్లీ-ఎన్సీఆర్‌లో మినహా ఇతర ప్రాంతాలన్నింటికీ వర్తింపు

న్యూఢిల్లీ, మార్చి 28: బీఎస్‌-4 వాహన అమ్మకాల విషయంలో ఆటోమొబైల్‌ డీలర్లకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. లాక్‌డౌన్‌ను ఎత్తేసిన తర్వాత దేశ రాజధాని ప్రాం తం (ఎన్సీఆర్‌)-ఢిల్లీలో మినహా మిగిలిన ప్రాంతాల్లో బీఎస్‌-4 వాహనాలను అమ్ముకొనేందుకు గడువును 10 రోజులు పొడిగించింది. గతంలో కోర్టు ఈ వాహన అమ్మకాలకు ఈ నెల 31వ తేదీని గడువుగా నిర్దేశించింది.  అయితే ప్రస్తుతం ఓవైపు కరోనా ముప్పు, మరోవైపు ఆర్థికమాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో బీఎస్‌-4 వాహన అమ్మకాల గడువును పొడిగించాలని కోరుతూ ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) కోరింది. దీనిపై జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ దీపక్‌గుప్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిపి లాక్‌డౌన్‌ ముగిశాక 10 రోజులపాటు బీఎస్‌-4 వాహనాలను అమ్ముకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం డీలర్ల వద్ద మిగిలి ఉన్న బీఎస్‌-4 వాహనాల్లో కేవలం 10 శాతం వాహనాలనే  అమ్ముకోవాలని, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో మాత్రం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహన అమ్మకాలను అనుమతించే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.logo