హైదరాబాద్: జూన్ 5: హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ దిగుమతి ప్రతిపాదనకు బ్రెజిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించినప్పటికీ, ఇండియాలో ఈ వ్యాక్సిన్ తయారయ్యే ప్లాంటు, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ) ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న కారణంతో బ్రెజిల్ జాతీయ ఆరోగ్య పర్యవేక్షణా సంస్థ దిగుమతులకు అనుమతి నిరాకరించింది. తర్వాత తాము అనుసరిస్తున్న ప్రమాణాలపై బ్రెజిల్‌కు భారత్ బయోటెక్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రస్తుత అనుమతులు లభించాయి.