గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 20, 2020 , 00:26:58

బొమ్మ దద్దరిల్లింది!

బొమ్మ దద్దరిల్లింది!
  • 2019లో రూ.5,613 కోట్లకు బాక్స్‌ ఆఫీస్‌ కలెక్షన్లు

ముంబై, ఫిబ్రవరి 19: సినిమా బొమ్మ దద్దరిల్లింది. గతేడాది విడుదలైన సినిమాలు అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నప్పటికీ సినిమాలు మాత్రం బాక్స్‌ ఆఫీస్‌ కలెక్షన్లతో కళకళలాడింది. గతేడాది ఏకంగా రూ.5,613 కోట్ల కనక వర్షం కురిసింది. అంతక్రితం ఏడాది వసూలైన దాంతో పోలిస్తే 27 శాతం అధికమని కేర్‌ రేటింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సరాసరిగా ఒక్కో సిని మా వసూళ్లు 15 శాతం పెరిగి రూ.23 కోట్ల కు చేరుకోగా, మొత్తం వసూళ్లలో టాప్‌-10 సినిమాల వాటా 42 శాతంగా ఉన్నదని పేర్కొంది. వీటిలో అవేంజర్‌: ఎండ్‌గేమ్‌ ఒక్క సినిమానే రూ.373 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే 13 సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను దాటగా, ఆరు బాలీవుడ్‌ సినిమాలు రూ.200 కోట్ల మార్క్‌ను దాటాయి. వీటిలో అమీర్‌ ఖాన్‌కు చెందిన దంగల్‌ సినిమా ఒక్కటే రూ.1,968 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొత్తం వసూళ్లలో మూడోవంతు ఈ సినిమా నుంచే రావడం విశేషం.  


logo
>>>>>>