e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News బిట్ కాయిన్ మ‌రో డౌన్ పాల్‌: 32 వేల డాల‌ర్లకు ప‌త‌న‌మై..!!

బిట్ కాయిన్ మ‌రో డౌన్ పాల్‌: 32 వేల డాల‌ర్లకు ప‌త‌న‌మై..!!

బిట్ కాయిన్ మ‌రో డౌన్ పాల్‌: 32 వేల డాల‌ర్లకు ప‌త‌న‌మై..!!

లండ‌న్‌: బిట్ కాయిన్‌తో స‌హా క్రిప్టో క‌రెన్సీల‌కు క‌ష్ట కాలం న‌డుస్తున్న‌ది. చైనా సెంట్ర‌ల్ బ్యాంక్ నిషేధ హెచ్చ‌రిక‌లు, టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ యూట‌ర్న్ ట్వీట్‌తో బుధ‌వారం బిట్ కాయిన్ అంత‌ర్గ‌త ట్రేడింగ్‌లో 32 వేల డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. తిరిగి 39 వేల డాల‌ర్లకు రిక‌వ‌రీ అయ్యింది.

భారీగా బిట్ కాయిన్ ప‌త‌నం కావ‌డంతో ఇండియ‌న్ క్రిప్టో క‌రెన్సీ ట్రేడ‌ర్లు గ‌త ఏడాది కాలంలో ఎన్న‌డూ లేని విధంగా కొనుగోళ్ల‌కు దిగారు. డోజ్ కాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, షిబా ఇను, ఎథీరియం త‌దిత‌ర క్రిప్టో క‌రెన్సీలు భారీగా ప‌త‌నం అయ్యాయి.

ప‌ర్యావ‌ర‌ణ ఆందోళ‌న‌ల కార‌ణంగా త‌మ కార్ల విక్ర‌యాల‌కు బిట్ కాయిన్ల‌ను అనుమ‌తించ‌బోమ‌ని ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించ‌గానే బిట్ కాయిన్‌, డిజిట‌ల్ క‌రెన్సీలు ప‌త‌నం బాట ప‌ట్టాయి.

క్రిప్టో క‌రెన్సీల లావాదేవీల‌ను అనుమ‌తించ‌బోమ‌ని చైనా సెంట్ర‌ల్ బ్యాంక్ హెచ్చ‌రించింది. క్రిప్టో క‌రెన్సీల లావాదేవీలు జ‌రుపొద్ద‌ని బ్యాంకులు, ఇత‌ర పేమెంట్స్ భాగ‌స్వామ్యుల‌ను హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

గ‌మ్మ‌త్తేమిటంటే ప్ర‌పంచంలోకెల్లా అత్య‌ధికంగా దాదాపు 75 శాతం బిట్ కాయిన్‌ మైనింగ్ కూడా చైనాలో జ‌రుగుతున్న‌ది. అనిశ్చిత ప‌రిస్థితుల్లో భార‌త క్రిప్టో ఎక్స్చేంజీల్లో ప‌లు కౌంట‌ర్లు పెరిగాయి.

భార‌త అతిపెద్ద క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ వాజిర్ఎక్స్‌లో 400 శాతం రెట్లు కొనుగోళ్లు వ్రుద్ధి చెందాయి. వాజిర్ ఎక్స్ వ్య‌వ‌స్థాప‌క సీఈవో నిశ్చ‌ల్ శెట్టి మాట్లాడుతూ క్రిప్టో క‌రెన్సీల ప‌త‌నం కొనుగోళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించింద‌ని ట్రేడ‌ర్లు భావిస్తున్నార‌న్నారు.

బిట్‌కాయిన్‌ ఒక్క ఏడాదిలో సంపాదించుకున్నంత వేగంగా విలువ‌ను కోల్పోతున్న‌ది. గ‌త నెల‌ రెండో వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30శాతానికి పైగా విలువ కోల్పోయింది.

ఈ నెల 13-20 మ‌ధ్యే క్రిప్టో క‌రెన్సీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 50 శాతం తుడిచి పెట్టుకు పోయింద‌ని కాయిన్‌జెకో డాట్ కామ్ వ్యాఖ్యానించింది. చైనా కొన్ని నెలల క్రితం సొంతంగా ఎలక్ట్రానిక్‌ కరెన్సీ వినియోగ‌ ప్రయోగాత్మకంగా మొద‌లు పెట్ట‌డం విశేషం.

2014లోనే దీనిపై పని ప్రారంభించింది. 2016లో డిజిటల్‌ కరెన్సీ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఏర్పాటు చేసింది. 2020 నుంచి ప్రయోగాత్మకంగా వినియోగాన్ని ఆరంభించింది. దీనిని ఈసీఎన్‌వై అని చైనా వ్యాఖ్యానిస్తున్న‌ది.

ఈసీఎన్‌వై అంటే ఎలక్ట్రానిక్‌ చైనీస్‌ యువాన్‌ అని అర్థం. వీటిని చెంగ్డూ, షెన్‌జెన్‌, షిన్జియాంగ్‌ వంటి 4 ప్రధాన నగరాల్లో పరీక్షించి తర్వాత వీటిని బీజింగ్‌, షాంఘైకి విస్తరించింది.

సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా ఎంపిక చేసిన వారికి కొంత డిజిటల్‌ కరెన్సీ పంపి, సూచించిన మాల్స్‌లో వినియోగించాలని కోరింది. చాలా బ్యాంకులు తమ నిధుల్లో కొంత భాగాన్ని డిజిటల్‌ కరెన్సీగా మార్చాలని పేర్కొంది. భవిష్యత్‌లో దీనిని ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే అవకాశం ఉంది.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

జూన్ 1-6 మ‌ధ్య ఐటీ వెబ్‌సైట్ ప‌ని చేయ‌దు.. ఎందుకంటే!

ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం


అహ్మదాబాద్‌లో కుప్ప‌కూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో

సముద్ర పర్యవేక్ష‌ణ‌కు ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించిన‌ చైనా

మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవ‌ర్‌

ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవ‌చ్చు.. ఆర్‌బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ

క‌మ‌ల్ హాస‌న్ కు మ‌రో షాక్: ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న క‌థ‌నాలు..!

కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?

వ్యాక్సిన్ త‌యారీ : నూత‌న‌ ఫార్మా బిలియ‌నీర్లుగా ఎదిగారు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిట్ కాయిన్ మ‌రో డౌన్ పాల్‌: 32 వేల డాల‌ర్లకు ప‌త‌న‌మై..!!

ట్రెండింగ్‌

Advertisement