సోమవారం 01 మార్చి 2021
Business - Feb 16, 2021 , 14:48:10

పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ : బీఓఎం, ఐఓబీ, బీఓఐ, సెంట్రల్‌ బ్యాంక్‌లు ఖరారు!

పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ  : బీఓఎం, ఐఓబీ, బీఓఐ, సెంట్రల్‌ బ్యాంక్‌లు ఖరారు!

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వేగవంతం చేసిన ప్రభుత్వం ఈ దిశగా నాలుగు పీఎస్‌యూ బ్యాంక్‌లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం), బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (బీఓఐ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్ (ఐఓబీ)‌, సెంట్రల్‌ బ్యాంక్‌ల పేర్లను ఈ జాబితాలో కుదించినట్టు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు  పంపాయి. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నాలుగు బ్యాంకుల్లో అమ్మకానికి పెట్టే రెండు బ్యాంకులను ఎంపిక చేస్తారని అధికారులు పేర్కొన్నారు.

ప్రయోగాత్మకంగా ప్రభుత్వం తొలిదశలో మధ్య చిన్న తరహా బ్యాంకుల ప్రైవేటీకరణను చేపట్టనుంది. రాబోయే సంవత్సరాల్లో దేశంలో అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణకూ ప్రభుత్వం సన్నద్ధమవుతుందని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిరాకరించారు. మరోవైపు బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా రంగంలో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగులు సోమవారం నుంచి రెండు రోజుల సమ్మె చేపట్టారు. 

VIDEOS

logo