బుధవారం 03 జూన్ 2020
Business - Mar 29, 2020 , 22:14:06

బీవోఐ రుణాలు చౌక

బీవోఐ రుణాలు చౌక

-వడ్డీరేట్లను భారీగా తగ్గించిన బ్యాంక్‌

ముంబై, మార్చి 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) తమ ఖాతాదారులకు భారీ ఊరటనిచ్చింది. బాహ్య ప్రామాణిక రుణ రేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఆదివారం బ్యాంక్‌ ప్రకటించింది. ‘ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించి వార్షిక రేటును 7.25 శాతానికి తీసుకొచ్చాం. దీనివల్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని ఖాతాదారులకు యథాతథంగా ఇస్తున్నాం. మా గృహ, వాహన రుణ గ్రహీతలతోపాటు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కస్టమర్లకు లాభం చేకూరగలదు’ అని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, బెంచ్‌మార్క్‌ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎంసీఎల్‌ఆర్‌) రేటును కూడా బ్యాంక్‌ 25 బేసిస్‌ పాయింట్ల వరకు కోత పెట్టింది. ఏడాది నుంచి నెల రోజుల కాలవ్యవధిపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ ప్రస్తుతం 7.95% ఉన్నది.


logo