శుక్రవారం 05 జూన్ 2020
Business - May 04, 2020 , 02:27:06

ఎంఎస్‌ఎంఈలకు బీవోబీ

ఎంఎస్‌ఎంఈలకు బీవోబీ

2,300 కోట్ల రుణాలు

న్యూఢిల్లీ, మే 3: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) గత నెల రోజుల్లో రూ.2,300 కోట్ల అత్యవసర రుణాలను అందజేసింది. కేంద్ర ప్రభుత్వం,ఆర్బీఐ మార్గ దర్శకాల ఆధారంగా ఎంఎస్‌ఎంఈలకు బీవోబీ ఈ ఎమర్జెన్సీ లోన్లను మంజూరు చేసింది. మరోవైపు గడిచిన ఆరేండ్లలో బీవోబీ మొండి బకాయిలు ఆరు రెట్లు పెరిగి రూ. 73,140 కోట్లకు చేరాయి. ఇండియన్‌ బ్యాంక్‌ ఎన్పీఏలు సైతం నాలుగింతలు ఎగిసి రూ. 32,561.26 కోట్లను తాకినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుస్తున్నది. 


logo