బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 12, 2020 , 00:44:39

బి-న్యూ మొబైల్స్‌ సంక్రాంతి ఆఫర్లు

బి-న్యూ మొబైల్స్‌ సంక్రాంతి ఆఫర్లు

హైదరాబాద్‌, జనవరి 11: మొబైల్‌ రిటైల్‌ రంగ సంస్థ బి-న్యూ మొబైల్‌..సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపిక చేసిన మొబైళ్లపై 66 శాతం వరకు రాయితీ పొందవచ్చునని కంపెనీ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి తెలిపారు. ఈ నెల చివరి వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద స్క్రాచ్‌ అండ్‌ విండ్‌ ద్వారా వాషింగ్‌ మిషన్లు, ఫ్రిజ్‌లు, మైక్రో ఓవెన్‌లు గెలుచుకునే అవకాశం కొనుగోలుదారులకు ఉంటుందన్నారు. ఈ పండుగ పూట సంస్థ రిటైల్‌ అవుట్‌లెట్లలో కొనుగోలు చేసిన ప్రతి మొబైల్‌పై ఖచ్చితమైన బహుమతులు పొందవచ్చునని ఆయన సూచించారు. వీటితోపాటు సెల్‌ఫోన్లకు సంబంధించిన యాక్ససరీస్‌లపై కూడా ప్రత్యేక రాయితీని ఇస్తున్నది సంస్థ. సులభ వాయిదా పద్దతిలో సున్న డౌన్‌పేమెంట్‌తో మొబైల్‌ను కొనుగోలు చేయడానికి ఆర్థిక సేవలు సైతం సంస్థ అందిస్తున్నది. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 77 స్టోర్లను నిర్వహిస్తున్నది. వీటిలో తెలంగాణలో 18-20 రిటైల్‌ అవుట్‌లెట్లను కలిగివుండగా, మిగతావి ఏపీల్లో ఏర్పాటు చేసింది.


logo
>>>>>>