మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:06:53

3.3 సెకండ్లలో 100 కి.మీ. వేగం

3.3 సెకండ్లలో 100 కి.మీ. వేగం

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన బీఎండబ్ల్యూ మోటోరాడ్‌.. దేశీయ మార్కెట్లోకి అడ్వెంచర్‌ స్పోర్ట్‌ బైకు ఎస్‌ 1000 ఎక్స్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.20.90 లక్షలుగా నిర్ణయించింది. 999 సీసీ నాలుగు సిలిండర్లు కలిగిన ఇంజిన్‌తో తయారైన ఈ బైకు కేవలం 3.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. logo