ఆదివారం 31 మే 2020
Business - Apr 21, 2020 , 00:30:53

బీఎండబ్ల్యూ సీఈవో రుద్రతేజ్‌ మృతి

బీఎండబ్ల్యూ సీఈవో రుద్రతేజ్‌ మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూపు ప్రెసిడెంట్‌, సీఈవో రుద్రతేజ్‌ సింగ్‌ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఆయన మృతి సంస్థకు తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది ఆగస్టులో సంస్థలో చేరిన ఆయన..అనతికాలంలో కంపెనీ అమ్మకాలు పెంచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగ్‌ స్థానంలో కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి అర్లిండో తైజేరియాను తాత్కాలిక ప్రెసిడెంట్‌, సీఈవోగా నియమించింది. 25 ఎండ్లకు పైగా అనుభవం కలిగిన సింగ్‌.. రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు.


logo