ప్రియం కానున్న బీఎండబ్ల్యూ కార్లు.. మహీంద్రా ట్రాక్టర్లు కూడా

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థలన్నీ తమ ఉత్పత్తుల ధరల పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ‘తోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా ఆ జాబితాలో చేరిపోయాయి. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి అన్ని రకాల బీఎండబ్ల్యూ, మినీ మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం తెలిపింది. అన్ని రకాల మోడల్ వాహనాలపై రెండు శాతం ధరలు పెరుగతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు. ఇన్పుట్ వ్యయం, కమోడిటీ ధరలు పెరిగిపోవడంతో కార్ల ధరలు పెంచక తప్పడం లేదన్నారు.
ప్రస్తుతం బీఎండబ్ల్యూ గ్రూప్.. 8 సిరీస్ గ్రేన్ కూప్, బీఎండబ్ల్యూ ఎక్స్6, జడ్4, ఎం2 కాంపిటీషన్, ఎం5 కాంపిటీషన్, ఎం8 కూప్, ఎక్స్3 ఎం, ఎక్స్5 ఎం మోడల్ కార్లపై ఆఫర్లు అందిస్తున్నది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ కారు కూడా తమ అన్ని రకాల కార్ల ధరలు కూడా పెంచనున్నట్లు తెలిపింది.
పెరగనున్న మహీంద్రా ట్రాక్టర్ల ధరలు
జనవరి ఒకటో తేదీ నుంచి తన ఉత్పత్తుల ధరలు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం ఆండ్ ఎం) పెంచనున్నది. వివిధ రకాల ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని సోమవారం మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో ట్రాక్టర్ల ధరలు పెంచక తప్పడం లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అన్ని రకాల మోడల్ ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని తెలిపింది.
కమోడిటీ ధరలు, వివిధ రకాల ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోవడంతో ట్రాక్టర్ల ధరలు పెంచాల్సి వస్తున్నదని మహీంద్రా అండ్ మహీంద్రా వివరించింది. వివిధ రకాల ట్రాక్టర్ల ధరల పెరుగుదల సమాచారాన్ని త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నది. గతవారం ప్యాసింజర్ వాహనాల నుంచి వాణిజ్య వాహనాల వరకు అన్ని మోడల్స్ ధరలు పెరుగుతాయని తెలిపింది.
మారుతి నుంచి హీరో మోటోకార్ప్స్ వరకు ధరల పెంపు బాట
ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్, హోండా, ఫోర్డ్, రెనాల్డ్ ఆ జాబితాలో చేరాయి. ఇక టూవీలర్ మేజర్ హీరో మోటోకార్ప్స్ కూడా తమ అన్ని రకాల మోడల్ బైక్‌లు, స్కూటీల ధరలు రూ.1500 పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
కొత్త రకం కరోనా వైరస్ ఏమిటి? ఎందుకంత ప్రమాదకరం?
బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
చంద్రుడిపై సాగు సాధ్యమేనా.. చైనా ప్రయోగం ఏం చెబుతోంది?
వంద రూపాయలకే భగవద్గీత.... వీడియో
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- విపక్షాల..అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి
- గుట్టను మలిచి.. తోటగా మార్చి..
- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
- ఎమ్మెల్సీ ఎన్నికకు దిశానిర్దేశం
- టీఆర్ఎస్కే ఓట్లడిగే హక్కుంది
- సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట
- సకల హంగులతఓ నందిగామ