న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బిట్‌కాయిన్ విలువ రికార్డుల మోత మోగిస్తున్నది. మంగళవారం ఒకానొక దశలో ఏకంగా ఒక్క కాయిన్ విలువ మునుపెన్నడూ లేనివి ధంగా 63,600 డాలర్ల (దాదాపు రూ.47.75 లక్షలు)కు సమీపించింది. నిరంతరం సాగే క్రిప్టో మార్కెట్ లావాదేవీల్లో కడపటి సమాచారం మేరకు 63,279.30 డాలర్ల వద్ద కదలాడుతున్నది. నాస్‌డాక్‌పై అమెరికా క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌బేస్ నమోదు కానున్న క్రమంలో బిట్‌కాయిన్‌పై పెట్టుబడులకు మదుపరులు పెద్ద ఎత్తున ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.