శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 08, 2021 , 23:49:02

టెస్లా 1.5 బిలియ‌న్ల పెట్టుబ‌డి: ‌బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డ్‌

టెస్లా 1.5 బిలియ‌న్ల పెట్టుబ‌డి: ‌బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డ్‌

కాలిఫోర్నియా: ప్ర‌ముఖ గ్లోబ‌ల్ విద్యుత్ కార్ల జెయింట్ టెస్లా యాజ‌మాన్యం 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్ట‌డంతో క‌్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్ విలువ ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పింది. వివాదాస్ప‌ద క్రిప్టో క‌రెన్సీగా పేరొందిన బిట్ కాయిన్‌లో అత్య‌ధిక పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌గా టెస్లా నిలిచింది.

బిట్ కాయిన్‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో పేర్కొన‌డంతో ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ 15 శాతం పెరిగిపోయింది. త‌ద్వారా దాని విలువ 44 వేల డాల‌ర్ల‌కు పెరిగిపోయింది.

గ‌రిష్ఠ స్థాయిలో బిట్ కాయిన్ విలువ పెరుగ‌డం ఇదే మొద‌టిసారి. విద్యుత్ కార్ల చెల్లింపుల కోసం డిజిట‌ల్ క‌రెన్సీని అంగీక‌రించ‌నున్న‌ట్లు ఎల‌న్ మ‌స్క్ సార‌థ్యంలోని టెస్లా కంపెనీ ప్ర‌క‌టించింది. అయితే, ఎల‌న్ మ‌స్క్ నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo