గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 05, 2021 , 00:33:19

బిట్‌ కాయిన్‌కు ‘బ్లాక్‌ మండే.. 20% డౌన్‌

బిట్‌ కాయిన్‌కు ‘బ్లాక్‌ మండే.. 20% డౌన్‌

న్యూఢిల్లీ: వర్చువల్‌ కరెన్సీ ’బిట్‌ కాయిన్‌’కు ఈ సోమవారం ‘బ్లాక్‌ మండే’గా మిగిలింది. ఇంతకుముందు రికార్డు స్థాయిలో 34,800 డాలర్లకు చేరుకున్న బిట్‌ కాయిన్‌ తన గ్రౌండ్‌ను కోల్పోయి, భారీగా పతనమైంది. నూతన సంవత్సర ట్రేడింగ్‌లో 33,670 డాలర్ల గరిష్ఠానికి చేరుకున్న బిట్‌ కాయిన్‌ తదుపరి 14 శాతానికి పైగా పతనమైంది. ఆదివారం నమోదైన 34800 డాలర్ల నుంచి బిట్‌ కాయిన్‌ 20 శాతం నష్టపోయింది.

ఇంతకుముందు బిట్‌ కాయిన్‌ 8 శాతం నష్టంతో 30,542 డాలర్ల వద్ద స్థిర పడింది. 2017లో అభివృద్ధి చెందినప్పటి నుంచి క్రిప్టో కరెస్సీ ‘బిట్‌ కాయిన్‌’ మూడు వారాల క్రితం డిసెంబర్‌ 16వ తేదీన తొలిసారి 20 వేల డాలర్లను తాకిన తర్వాత రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. గతేడాదితో పోలిస్తే బిట్‌ కాయిన్‌ విలువ నాలుగు రెట్లు పెరిగింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo