బుధవారం 03 మార్చి 2021
Business - Feb 19, 2021 , 12:51:03

బిట్‌కాయిన్ సంచ‌ల‌నం.. ల‌క్ష కోట్ల డాల‌ర్ల మార్కెట్ విలువ!

బిట్‌కాయిన్ సంచ‌ల‌నం.. ల‌క్ష కోట్ల డాల‌ర్ల మార్కెట్ విలువ!

క్రిప్టోక‌రెన్సీ బిట్‌కాయిన్ దూకుడుకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఏకంగా ల‌క్ష కోట్ల డాల‌ర్ల మార్కెట్ విలువ‌కు చేరువైంది. ఈ ఏడాదిలోనే 41500 కోట్ల డాల‌ర్ల విలువ పెర‌గ‌డం విశేషం. దీంతో ప్ర‌స్తుతం బిట్‌కాయిన్ మొత్తం మార్కెట్ విలువ 95600 కోట్ల డాల‌ర్ల‌కు చేరిన‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ వెల్ల‌డించింది. అటు బిట్‌కాయిన్ స‌హా మ‌రో నాలుగు క్రిప్టో కాయిన్ల‌ను క‌లిగి ఉన్న‌ బ్లూమ్‌బ‌ర్గ్ గెలాక్సీ క్రిప్టో ఇండెక్స్ ఏకంగా రెట్టింపైంది. 

ప్ర‌స్తుతం హాంకాంగ్‌లో బిట్‌కాయిన్ 51300 డాల‌ర్ల దగ్గ‌ర ట్రేడ్ అవుతోంది. 2021లో స్టాక్స్‌, బంగారం, క‌మోడిటీలు, బాండ్ల కంటే బిట్‌కాయిన్ ఎంతో ఎత్తున ఉండ‌టం విశేషం. ఈ మ‌ధ్యే బిట్‌కాయిన్‌లో టెస్లా కూడా ఏకంగా 150 కోట్ల డాల‌ర్ల‌ను ఇన్వెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. త‌న సంస్థ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని సీఈవో ఎలోన్ మ‌స్క్ స‌మ‌ర్థించుకున్నారు. 

VIDEOS

logo