శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 14, 2020 , 23:05:57

మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు బిల్‌గేట్స్‌ గుడ్‌బై

మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు బిల్‌గేట్స్‌ గుడ్‌బై

శాన్‌ ఫ్రాన్సిస్కో, మార్చి 14: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌.. సంస్థ బోర్డుకు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఇకపై దాతృత్వ సేవలకే ఆయన ఎక్కువ సమయం వెచ్చించనున్నారు. 64 ఏండ్ల బిల్‌గేట్స్‌ దశాబ్దకాలం కిందటే సంస్థ రోజువారి కార్యకలాపాల నుంచి తప్పుకోగా, 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల చైర్మన్‌ పదవికి వీడ్కోలు పలికారు. భార్య మిలిందాతో కలిసి బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి దాతృత్వ సేవలను అందిస్తున్నారు. ‘బిల్‌గేట్స్‌తో పనిచేయడం గొప్ప గౌరవం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బిల్‌గేట్స్‌ ఎక్కడున్నా.. ఆయన్ను అనుసరిస్తానని చెప్పారు. 


logo