న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పూర్తిగా కుప్ప కూలి పోవడం ఖాయం అని మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. గత వారాంతంలో క్రిప్టో కరెన్సీ 15 శాతానికిపైగా పతనమైన నేపథ్యంలో గతంలో ఆయన వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకున్నది.
‘నేను బిట్ కాయిన్‌ను స్వంతం చేసుకోను. నేను దాన్ని షార్టింగ్ చేయబోను. నేను తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నా.. డబ్బు డిజిటల్ దిశగా రూపాంతరం చెందుతుంది. లావాదేవీల ఖర్చు తగ్గుతుంది’ అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బిట్ కాయిన్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 14వ తేదీన జరిగిన ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ ఆల్ టైం రికార్డులు నెలకొల్పి 64 వేల డాలర్లపై చిలుకు దాటింది. అమెరికాలోని అతిపెద్ద ట్రేడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ అండ్ పీ 500లో గతవారం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ ట్రేడింగ్ ప్రారంభించాక బిట్ కాయిన్ విలువ పతనమైంది.
తర్వాత కోలుకున్నా గతవారం 12 శాతం దిగువనే తచ్చాడుతున్నది. మున్ముందు కూడా బిట్ కాయిన్ విలువ మరింత దారుణంగా మారుతుందని బిల్ గేట్స్ అంచనా వేశారు. 2013లోనూ క్రిప్టో కరెన్సీ.. ‘టూర్ డీ ఫోర్స్’గా నిలుస్తుందని బిల్ గేట్స్ చెప్పారు. ప్రభుత్వాలు పై చేయి సాధించినప్పుడు బిట్ కాయిన్ పతనమవుతుందన్నారు.
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది
కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!
అసలు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజన్, వ్యాక్సినేషన్‌పై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం
తులం బంగారం 4 నెలల్లో రూ.50వేలకు.. పరిస్థితి విషమిస్తే.. మరింత పైపైకి!