e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home టాప్ స్టోరీస్ రూ.55వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. పేటెంట్‌ పొందిన హైదరాబాదీ సంస్థ

రూ.55వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. పేటెంట్‌ పొందిన హైదరాబాదీ సంస్థ

  • హైదరాబాదీ ఈవీ అటుమొబైల్‌కు బైక్‌ డిజైన్‌ పేటెంట్‌

హైదరాబాద్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) తయారీ స్టార్టప్‌ అటుమొబైల్‌.. తమ కేఫ్‌-రేసర్‌ ైస్టెల్డ్‌ ఆటమ్‌ 1.0 మోడల్‌ బైక్‌కు డిజైన్‌ పేటెంట్‌ను సొంతం చేసుకున్నది. స్పోర్టియర్‌ రైడింగ్‌ భంగిమ, 14 లీటర్ల స్టోరేజి ట్యాంక్‌, ఆకర్షణీయ బాడీ స్ట్రక్చర్‌కుగాను ఈ పేటెంట్‌ దక్కినట్లు సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

స్టాండర్డ్‌, స్పోర్ట్‌, క్రూయిసర్‌ తదితర బహుళ రైడింగ్‌ భంగిమలు తమ బైక్‌ ప్రత్యేకతలని, తమ ఆర్‌అండ్‌డీ బృందం దీనికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్లు సంస్థ సీఈవో గడ్డం వంశీ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అక్టోబర్‌ 5న ఈ మోడల్‌ను పరిచయం చేయగా, అప్పట్నుంచి దేశవ్యాప్తంగా 850 బుకింగ్‌లు వచ్చాయి. కాగా, లిథియం-ఇయాన్‌ బ్యాటరీతో నడిచే ఈ బైక్‌ ధర రూ. 55,000లుగా ఉన్నది.

- Advertisement -

నాలుగు గంటల్లో పూర్తి చార్జ్‌ అవుతుందని, ఒక్కసారి చార్జ్‌చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, బ్యాటరీకి ఒక సంవత్సరం వారంటీ ఇస్తున్నామని వంశీ పేర్కొన్నారు. పటాన్‌చెరూలో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. లో-స్పీడ్‌ బైక్‌ కింద దీనికి ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐసీఏటీ) అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana