సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 04, 2020 , 02:14:22

గరిష్ఠ ఆలస్య రుసుము రూ.500లే

గరిష్ఠ ఆలస్య రుసుము రూ.500లే

న్యూఢిల్లీ, జూలై 3: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులకు గొప్ప ఊరట లభించింది. నెలసరి, త్రైమాసిక జీఎస్టీఆర్‌-3బీ రిటర్నుల దాఖలు ఆలస్యానికిగాను గరిష్ఠ ఫీజు పరిమితిని ఒక్కో రిటర్నుకు రూ.500లుగా నిర్ణయించారు. జూలై 2017 నుంచి జూలై 2020 వరకున్న వ్యవధికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అధికంగా ఉన్న ఆలస్య రుసుములను తగ్గించాలని వివిధ సామాజిక మాధ్యమాల్లో పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో ఫీజుల భారాన్ని తగ్గిస్తే ఉపశమనాన్ని పొందుతామని, బకాయిలనూ తీర్చేందుకు ప్రోత్సాహం లభించినట్లు అవుతుందన్నారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం వెలువడింది. దీంతో నిపుణులు, వ్యాపారులు, పన్ను చెల్లింపుదారుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ ఆఖర్లోగా జీఎస్టీఆర్‌-3బీ రిటర్నులు దాఖలు చేసినవారికే ఫీజు తగ్గింపు వర్తిస్తుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు (సీబీఐసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 


logo