లండన్: బిట్ కాయిన్‌తో సహా క్రిప్టో కరెన్సీల్లో మదుపర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో నెలలోనే తొలిసారి బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్ల దిగువన తచ్చాడుతున్నది. ఇతర క్రిప్టో కరెన్సీల విలువ భారీగా పతనమైంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ 29,831.70 డాలర్లుగా ఉంది. జూన్ 22న కూడా బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయింది.
బిట్ కాయిన్ తర్వాతీ స్థానంలో ఉన్న ఎథీరియం విలువ మంగళవారం 7.86 శాతం తగ్గి 1,762 డాలర్ల వద్ద నిలిచింది. టెథర్ 0.02 శాతం తగ్గి డాలర్‌కు, బినాన్స్ కాయిన్ 12.03 శాతం నష్టంతో 266 డాలర్ల వద్ద స్థిరపడింది. డోజ్కాయిన్ సైతం 7.58 % నష్టంతో 0.1662 డాలర్లు పలికింది. ఏథీరియం క్లాసింగ్ 7.18 శాతం పతనమై 39.06 డాలర్ల వద్దకు చేరుకున్నది.
సోమవారం క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్ల (98 బిలియన్ల డాలర్లు) మేరకు నష్టపోయారు. 30 వేల డాలర్ల వద్ద బిట్ కాయిన్‌కు మద్దతుగా మరికొంత నష్టపోవాల్సి వస్తుందని ట్రేడర్లు తెలిపారు. అంతకంటే దిగువకు పతనమైతే క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగపూర్‌లోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లునో ఆసియా పసిఫిక్ హెడ్ విజయ్ అయ్యర్ మాట్లాడుతూ కోవిడ్-19 డెల్టా వేరియంట్ వల్ల గ్లోబల్ ఈక్విటీలు పతనం అవుతున్నాయన్నారు. దీనికి ఎకనమిక్ గ్రోత్ నెమ్మదించడమే కారణం అన్నారు. బుల్లిష్ ట్రెండ్ తిరిగి పుంజుకోవాలంటే మరో పునాది వేయాల్సి ఉందన్నారు.
అమెరికాలోని డోజోన్స్ మార్కెట్ భారీగా పతనమైంది. డోజోన్స్ ఇండెక్స్ 2.09 శాతం నష్టపోయి 33,962 పాయింట్లు కోల్పోయింది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 1.58 శాతం, నాస్డాక్ 1.06 శాతం పతనం అయ్యాయి.
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై బాగానే ఉండొచ్చు. వరుసగా మూడో రోజు స్టాక్‌మార్కెట్లు పతనం కావడమే దీనికి నిదర్శనం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 0.5 శాతం, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 0.5 శాతానికి పైగా పతనం అయ్యాయి.
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
మొబైల్ స్క్రీన్ పగిలిపోయిందా? ఇక దానికదే అతుక్కుంటుంది.. అదెలాగంటే
రైతుల నుంచి 3000 కోట్లు వెనక్కి తీసుకుంటున్నాం..
పుష్పలో కీలక పాత్ర..యాక్టర్ కమ్ డైరెక్టర్ క్లారిటీ
స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసిన యుట్యూబ్…
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
ఐటీ కొలువుల మేళా : 1.5 లక్షల మంది ఫ్రెషర్స్ నియామకానికి టెక్ దిగ్గజాలు రెడీ!
వేదంతాకు షాక్.. వీడియోకాన్ టేకోవర్‌పై ఎన్సీఎల్ఏటీ స్టే..