సోమవారం 30 మార్చి 2020
Business - Jan 21, 2020 , 01:31:14

బిగ్‌బజార్‌ సబ్‌సే సస్తేదిన్‌

బిగ్‌బజార్‌ సబ్‌సే సస్తేదిన్‌

న్యూఢిల్లీ, జనవరి 20: ఏటా రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రత్యేక రాయితీలు అందిస్తున్న బిగ్‌బజార్‌.. ఈ ఏడాదీ సిద్ధమైంది. ‘సబ్‌సేసస్తే 5 దిన్‌' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు 22-26 వరకు అమలులో ఉండనున్నాయి. ఆహార ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తున్న సంస్థ.. రెండు కొంటే ఒకటి ఫ్రీ, దుస్తులపై 50 శాతం రాయితీ, రూ.13,505 విలువైన కిచెన్‌ కోంబో సెట్‌ను కేవలం రూ.4,999కి, 43 అంగుళాల రూ.39,990 విలువైన కోర్యో టీవీని రూ.14,999కి, ట్రాలీ బ్యాగులపై 70 శాతం రాయితీకే విక్రయిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సదాశివ్‌ మాట్లాడుతూ.. రోజువారి, గృహ నిర్వహణ, ఫ్యాషన్‌, ఇతర అవసరాల నిమిత్తం కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయమన్నారు. రూపే కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి మరో 10 శాతం రాయితీ లభించనున్నది.


logo