న్యూఢిల్లీ : ఫ్యూచర్ గ్రూపు రిటైల్ చైన్ బిగ్ బజార్ భారీ ఆఫర్ ప్రకటించింది. రూ 1500 విలువైన షాపింగ్ చేసిన కస్టమర్లకు రూ 1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తామని వెల్లడించింది. ఈనెల 22న ఆఫర్ మొదలై 31తో ముగుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. రూ 1000 క్యాష్ బ్యాక్ తో పాటు రెండు గంటల్లోనే ఉచిత హోం డెలివరీ అందిస్తామని తెలిపింది.
కస్టమర్లు ఇంటి వద్ద నుంచే బిగ్ బజార్ యాప్, ఆన్లైన్ స్టోర్ షాప్ నుంచి కూడా ఈ ఆఫర్ కింద కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరిస్తూ కస్టమర్లు తమ సమీప స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చని గ్రూప్ సీఎంఓ, డిజిటల్ మార్కెటింగ్ పవన్ సర్థా పేర్కొన్నారు.