e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఇండియాలో అమెరికా పెట్టుబ‌డుల‌పై ట్యాక్స్‌.. బైడెన్ వ్యూ ఇది?

ఇండియాలో అమెరికా పెట్టుబ‌డుల‌పై ట్యాక్స్‌.. బైడెన్ వ్యూ ఇది?

ఇండియాలో అమెరికా పెట్టుబ‌డుల‌పై ట్యాక్స్‌.. బైడెన్ వ్యూ ఇది?

న్యూఢిల్లీ: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌.. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టిన బ‌హుళ జాతి సంస్థ‌ల‌ (ఎంఎన్సీ)‌పై ద్రుష్టి సారించారు. విదేశాల్లో ఆయా సంస్థ‌లు సంపాదించిన గ్లోబ‌ల్ ఫ్రాపిట్ల‌పై అద‌నంగా ప‌న్ను భారం ప‌డ‌నున్న‌ది. బైడెన్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంతో భార‌త్‌కు ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చున‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

విదేశాల్లో లాభాలు గ‌డించిన దేశాల్లో స‌ద‌రు సంస్థ‌లు క‌నీసం 28 శాతం ప‌న్ను చెల్లించ‌క‌పోతే, దేశీయంగా అద‌నంగా డొమెస్టిక్ టాక్స్ వ‌సూలు చేసేందుకు సిద్ధం అవుతున్న‌ది బైడెన్ స‌ర్కార్‌. ఈ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాలిస్తే, 2019లో ఉత్పాద‌క రంగంలోకి భారీగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు భార‌త ప్ర‌భుత్వ నూత‌న ప‌న్నుల విధానంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంచ‌నా. ‌

బైడెన్ అడ్మినిస్ట్రేష‌న్ నూతన ప్ర‌తిపాద‌న.. భార‌త్ నూత‌న ప‌న్ను విధానంతో విభేదిస్తున్న‌ది. భార‌త్‌లో నూత‌న ఉత్పాద‌క యూనిట్‌ను స్థాపించిన సంస్థ‌కు 15 శాతం ప‌న్ను రాయితీ క‌ల్పిస్తున్న‌ది మోదీ స‌ర్కార్‌.. దీనికి తోడు అద‌న‌పు లెవీలు ఉంటాయ‌ని పేర్కొంటున్నారు.

భార‌త్‌లో ప‌న్నులు త‌క్కువ‌గా ఉండ‌టం కొత్త కాదు.. భార‌త్‌లో ఉత్పాద‌క యూనిట్ స్థాపించిన అమెరికా కంపెనీ 15 శాతం ప‌న్ను రాయితీ ఉన్నా.. బైడెన్ విధానంతో ఇబ్బందులు త‌లెత్తనున్నాయ‌ని తెలుస్తున్న‌ది.

తాజా ప‌రిణామం నేప‌థ్యంలో అమెరికా కంపెనీలు భార‌త్‌లో ప‌న్ను రాయితీ పొంద‌డ‌మా? అమెరికాలో షీల్డ్ చెల్లించాలా? వ‌ద్దా? నిర్ణ‌యించుకోవాల‌ని ధ్రువ అడ్వైజ‌ర్స్ పార్ట‌న‌ర్ అజ‌య్ రోటి చెప్పారు.

ప‌న్ను నిపుణుల అంచ‌నా ప్ర‌కారం భార‌త్‌లో ఉత్పాద‌క యూనిట్లు స్థాపించాలా ? లేదా అన్న సంగ‌తిని అమెరికా సంస్థ‌లు నిర్ణ‌‌యించుకోలేదు.బైడెన్ ప్ర‌భుత్వం కూడా ఆయా సంస్థ‌ల‌పై అద‌న‌పు లెవీ విధించాలా? లేదా? అనే విష‌యం నిర్ధార‌ణ‌కు రాలేదు.

2019లో ఇప్ప‌టికే దేశంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న విదేశీ సంస్థ‌ల‌పై మోదీ స‌ర్కార్ కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి త‌గ్గించింది. కొత్త వాటిపై 15-25 శాతం ప‌న్నులు విధిస్తున్న‌ది.

క‌నుక భార‌త్‌లో ప‌న్ను రాయితీ పొందాలా.. అమెరికాలో 28 శాతం ప‌న్ను చెల్లించాలా? అన్న విష‌యం అమెరికా సంస్థ‌లు నిర్ణ‌యించుకోవాల‌ని ప‌న్ను నిపుణులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు@62,377 డాల‌ర్లు!

తెలుగు ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఉగాది శుభాకాంక్ష‌లు

ఇదెక్క‌డి పోయేకాలం.. యువ‌కుడి జ‌న‌నాంగం కోసేసిన‌ న‌పుంస‌కులు..!

దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు

‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

రెండు కాళ్లు, మూడు చేతుల‌తో.. ఒడిశాలో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఎఫ్ 3 చిత్రంలో వ‌కీల్ సాబ్ బ్యూటీ..!

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

సెప్టెంబ‌ర్ నాటికి ముగియ‌నున్న ఎయిర్ ఇండియా అమ్మకం..?!

బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్‌..వీడియో వైర‌ల్

కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డ‌బ్ల్యూహెచ్ఓ

అంత త‌క్కువ ధ‌ర‌కు మా వ్యాక్సిన్ అమ్మ‌లేం: ఆర్డీఐఎఫ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇండియాలో అమెరికా పెట్టుబ‌డుల‌పై ట్యాక్స్‌.. బైడెన్ వ్యూ ఇది?

ట్రెండింగ్‌

Advertisement