మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 11, 2020 , 23:31:15

నిరాశపరిచిన భెల్‌

నిరాశపరిచిన భెల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: విద్యుత్‌ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్‌ లాభాలకు ఆదాయం సెగ తగిలింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకుగాను సంస్థ రూ.161.81 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.196.43 కోట్లతో పోలిస్తే 17 శాతం పడిపోయింది. ఆదాయం విషయానికి వస్తే రూ.7,563. 51 కోట్ల నుంచి రూ.5,827.14 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలానికిగాను నికర లాభం రూ.321.64 కోట్ల నుంచి రూ.63.83 కోట్లకు తగ్గింది. 


logo
>>>>>>