ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 18, 2021 , 01:54:45

ఎయిర్‌టెల్‌ చేతికి భారతీ టెలిమీడియా

ఎయిర్‌టెల్‌ చేతికి భారతీ టెలిమీడియా

  • మరో 20 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌.. తన అనుబంధ సంస్థయైన డీటీహెచ్‌ భారతీ టెలిమీడియాలో మరో 20 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. వార్‌బర్గ్‌ పిన్‌కస్‌కు చెందిన ఈ 20 శాతం వాటాను రూ.3,126 కోట్లకు కొనుగోలు చేయబోతున్నది. 2018లో వార్‌బర్గ్‌ ఈ 20 శాతం వాటాను రూ.2,310 కోట్లకు కొనుగోలు చేసింది. వ్యాపార వ్యూహంలో భాగంగా ఒకే గొడుగు కిందకు అన్ని వ్యాపారాలను చేర్చాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందానికి మొగ్గుచూపినట్లు, తద్వారా ఇతర విభాగాలు కూడా ఒక్కతాటిపైకి రానున్నాయని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. 

VIDEOS

logo