ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 04, 2021 , 03:10:07

మళ్లీ లాభాల్లోకి ఎయిర్‌టెల్‌

మళ్లీ లాభాల్లోకి ఎయిర్‌టెల్‌

  • క్యూ3లో 854 కోట్ల ప్రాఫిట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: భారతీ ఎయిర్‌టెల్‌ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. వరుసగా 6 త్రైమాసికాలు నష్టాలకే పరిమితమైన ఈ టెలికం సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌లో రూ.854 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం ఆదేశంతో 2019-20 జూలై-సెప్టెంబర్‌ నుంచి నష్టాలే. అయితే దేశీయ మార్కెట్‌లో తమ వినియోగదారులు పెరిగారని, ఆదాయం కూడా పుంజుకున్నదని బుధవారం సంస్థ తెలియజేసింది. రికార్డు స్థాయిలో రూ. 26,518 కోట్ల ఏకీకృత త్రైమాసిక ఆదాయాన్ని పొందింది.

VIDEOS

logo