శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 30, 2020 , 01:07:17

ఎయిర్‌టెల్‌ నష్టం 15,933 కోట్లు

ఎయిర్‌టెల్‌ నష్టం 15,933 కోట్లు

  • తగ్గిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లు
  • ఏప్రిల్‌లో టెల్కోలకు 82 లక్షల మంది దూరం

న్యూఢిల్లీ : దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ భారీ నష్టాలను మూటగట్టుకున్నది. జూన్‌తో ముగిసిన మూడు నెలలకుగాను సంస్థ రూ.15,933 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిలను చెల్లింపులకోసం అధికంగా నిధులు కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోనూ సంస్థ రూ.2,866 కోట్లు నష్టపోయింది. ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 15.4 శాతం పెరిగి రూ.23,939 కోట్లుగా నమోదైంది. 

టెలికం సంస్థలు ఏప్రిల్‌ నెలలో 82 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు అధికంగా దూరమైనట్లు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తాజాగా తెలియజేసింది. మార్చిలోనూ టెల్కోలు 28 లక్షల వినియోగదారులను నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే రిలయన్స్‌ జియో కస్టమర్లు పెరిగినట్లు ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ‘కరోనా నేపథ్యంలో వచ్చిపడిన లాక్‌డౌన్‌, తదనంతర పరిస్థితుల ప్రభావం టెలికం రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది. రాబోయే నెలల్లోనూ ఇదే రకమైన ఒత్తిడి ఉండొచ్చు’ అని ఇండియా రేటింగ్స్‌ అభిప్రాయపడింది. కాగా, బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులు కూడా ఏప్రిల్‌లో 1.11 కోట్లు తగ్గిపోయారని పేర్కొన్నది. గడిచిన రెండేండ్లలో ఇదే తొలి క్షీణత కావడం గమనార్హం.


logo