శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 18, 2020 , 22:26:12

ఇక్కడ పెట్రోల్‌, డీజిల్‌ కొట్టిస్తే బిల్లు పారేయకండి..!

ఇక్కడ పెట్రోల్‌, డీజిల్‌ కొట్టిస్తే బిల్లు పారేయకండి..!

హైదరాబాద్‌: ఏంటి.. పెట్రోల్‌, డీజిల్‌ కొట్టిస్తే కారు ఎలా గెలుచుకోవచ్చని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇది మీ కోసమే చదవండి. ప్రభుత్వ చమురు సంస్థ ‘ఇండియన్‌ ఆయిల్‌’ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేవారికి మంచి ఆఫర్ తెచ్చింది. ఈ ఆఫర్ కింద, మీరు ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్ పంపు నుంచి కనీసం 400 రూపాయల డీజిల్ లేదా పెట్రోల్ కొనుగోలు చేస్తే, మీరు ఎస్‌యూవీ కారును గెలుచుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ కారుతో పాటు ఇండియన్‌ ఆయిల్‌  అనేక ఇతర బహుమతులను అందిస్తోంది.  

ఇండియన్‌ ఆయిల్‌ దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ పేరు 'భరో ఫ్యూయల్ జీతో కార్'. అంటే పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసి కారు గెలుచుకునే లక్కీ ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్‌ 2020 డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఎస్‌యూవీలతో సహా అనేక ఇతర బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్ 2020 డిసెంబర్ 4 నుంచి ప్రారంభమైంది. మీరు పెట్రోల్ లేదా డీజిల్ కొన్న వెంటనే మీకు ప్రింటెడ్ బిల్లు వస్తుంది. ఆ బిల్ నంబర్, డీలర్ కోడ్ అందులో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఈ బిల్లును ఎస్ఎంఎస్ డీలర్ కోడ్ బిల్ నంబర్ ద్వారా తీసుకోండి.  అయితే, ఒక్కసారి మాత్రమే మీరు  లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హులు. ఈ ఆఫర్‌ను మీరు కేవలం డీలర్ కోడ్ ఎస్‌ఎంఎస్‌  పంపడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్‌ కింద ఎస్‌యూవీ (మెగా లక్కీ డ్రా), 4 కార్లు (మెగా లక్కీ డ్రా), 16 మోటార్ సైకిళ్లు  (మెగా లక్కీ డ్రా),  ప్రతి వారం 25 మంది విజేతలకు 5 వేల రూపాయల ఉచిత పెట్రోల్ బహుమతిగా ఇస్తారు. 100ఎక్స్‌ ఎక్స్‌ట్రా రివార్డ్స్ సభ్యులకు (ఎక్స్‌ట్రా రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నవారు) విజేతలకు ప్రతిరోజూ 100 రూపాయలకు పెట్రోల్ లేదా డీజిల్ ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తున్నారు. అయితే, మీకు బహుమతి వస్తే, మీరు కొన్న పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన బిల్లును సమర్పించాలి. పెట్రోల్ కొనుగోలు చేయడానికి మీ బిల్లును భద్ర పరుచుకున్నప్పుడు మాత్రమే ఈ బహుమతి లభిస్తుంది. బిల్లు పోతే, మీకు ఈ బహుమతికి అర్హత ఉండదు. ఇండియన్‌ ఆయిల్‌ అధికారులు బహుమతి విజేతలను సంప్రదించి ధ్రువీకరిస్తారు. అలాగే, విజేతల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతారు. పూర్తి వివరాల కోసం ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

ఇవి కూడా చదవండి..

ఆరోగ్య బీమాకు వాట్సాప్‌ అండ

టాప్ గెయినర్స్ లిస్ట్ లో... ఎమ్ అండ్ ఎమ్, యూపీఎల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo