శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 28, 2021 , 00:04:53

జీఎస్‌కే, పాథ్‌తో భారత్‌ బయోటెక్‌ జోడీ

జీఎస్‌కే, పాథ్‌తో భారత్‌ బయోటెక్‌ జోడీ

హైదరాబాద్‌, జనవరి 27: మలేరియా వ్యాక్సిన్‌ను దీర్ఘకాలంపాటు సరఫరా చేసేందుకు భారత్‌ బయోటెక్‌, గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సంస్థ జీఎస్‌కే, ‘పాథ్‌' ఉత్పత్తి బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జీఎస్‌కే అభివృద్ధి చేసిన ‘ఆర్‌టీఎస్‌,ఎస్‌/ఏఎస్‌01ఈ’ మలేరియా వ్యాక్సిన్‌లో అంతర్భాగంగా ఉండే యాంటీజెన్‌ తయారీతోపాటు ఆ వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని లైసెన్సుల మంజూరు హక్కులను భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు బీబీఐఎల్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

VIDEOS

logo