గురువారం 04 జూన్ 2020
Business - May 08, 2020 , 02:07:06

హైసియా నూతన అధ్యక్షుడిగా భరణి కుమార్‌

హైసియా నూతన అధ్యక్షుడిగా భరణి కుమార్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌(హైసియా) నూతన ప్రెసిడెంట్‌గా భరణి కుమార్‌ నియమితులయ్యారు. 2020-22 సంవత్సరానికిగాను హైసియా నూతన ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ కమిటీని  గురువారం ప్రకటించింది. అమెరికాకు చెందిన టెక్‌ట్రియాడ్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ‘ఇన్ఫోపీర్స్‌ సొల్యుషన్స్‌'కు సీఈవోగా వ్యవహరిస్తున్న కుమార్‌.. గతంలో సైబరాబాద్‌ పోలీస్‌, హైదరాబాద్‌ ఐటీ ఇండస్ట్రీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ సెక్రటరీగా రెండుసార్లు విధులు నిర్వహించారు.


logo