శనివారం 28 నవంబర్ 2020
Business - Nov 22, 2020 , 01:08:54

దాతృత్వంలోనూ బెజోష్‌

దాతృత్వంలోనూ బెజోష్‌

  • లాభాపేక్షలేని సంస్థలకు 
  • 684 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు
న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే పలు లాభాపేక్షలేని సంస్థలకు వేలాది కోట్ల రూపాయలు విరాళంగా అందచేసిన అమెజాన్‌ అధిపతి..తాజాగా 16 పర్యావరణ సంస్థలకు మొత్తంగా 791 మిలియన్‌ డాలర్లను అందచేశారు. ఈ విషయాన్ని ఆయన్నే స్వయంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వీటిలో అమెజాన్‌కు చెందిన 684 మిలియన్‌ డాలర్ల విలువైన 2,20,826 షేర్లను లాభాపేక్షలేని సంస్థలకు అందించడం విశేషం. మొత్తంగా ఈ ఏడాది 856 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విరాళంగా అందచేసినట్లు అయింది. తాజాగా బ్లూంబర్గ్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం ఆయన సంపద 183 బిలియన్‌ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న పెను మార్పులకు వ్యతిరేకంగా 10 బిలియన్‌ డాలర్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లోభాగంగా బెజోస్‌ ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు.