సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 22, 2020 , 23:25:23

కరెన్సీతో జాగ్రత్త!

కరెన్సీతో జాగ్రత్త!

కరోనా వైరస్‌ నేపథ్యంలో కరెన్సీ నోట్లను తాకినా, లె క్కించినా ఆ త ర్వాత తప్పకుండా అంతా చేతులు కడుక్కోవాలని భారతీయ బ్యాంకుల సంఘం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది. వీలైనంత వరకు లావాదేవీల కోసం ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాకింగ్‌ వేదికలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూ చించింది. అలాగే అనవసరంగా బ్యాంక్‌ శాఖలను సందర్శించవద్దని కోరింది. ‘భౌతికంగా బ్యాంకింగ్‌/కరెన్సీ లెక్కింపు/ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ లావాదేవీల తర్వాత, ముందు కనీసం 20 సెకండ్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలి’ అని ఐబీఏ విజ్ఞప్తి చేసింది. ‘కరోనా సే దరో నా, డిజిటల్‌ కరో నా’ అనే ప్రచారాన్నీ ఐబీఏ ప్రారంభించింది. 


logo