గురువారం 01 అక్టోబర్ 2020
Business - Aug 10, 2020 , 02:26:48

మీ పిల్లల భవిష్యత్తుకు యులిప్‌, ఎంఎఫ్‌లు

మీ పిల్లల భవిష్యత్తుకు యులిప్‌, ఎంఎఫ్‌లు

తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తును మించిన ఆలోచనలుండవు. వారి భవిష్యత్తు బంగారుమయం కావాలంటే ఆర్థికపరమైన దన్ను తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌), యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌)లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అయితే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?. మీకు దీర్ఘకాల లక్ష్యాలుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. లేకపోతే యులిప్‌ సరైనది. న్యూ-ఏజ్‌ చైల్డ్‌ యులిప్‌ ప్లాన్లు పాలసీదారు మరణానంతరం కూడా ప్రయోజనాలను ఇస్తా యి. తల్లిగానీ, తండ్రిగానీ లేదా బీమా చేసిన వ్యక్తి చనిపోతే కుటుంబ పోషణ కోసం నగదు వస్తుంది. పిల్లల విద్య కోసం నెలనెలా ఆర్థిక సాయం అందుతుంది. పాలసీ టర్మ్‌ ముగిసే నాటికి మెచ్యూరిటీ మొత్తం పిల్లలకు చేరుతుంది. ఇక ఇతర మ్యూచువల్‌ ఫండ్స్‌ తో పోల్చితే ఈ చైల్డ్‌ ఎంఎఫ్‌లు ప్రత్యేకమేమీ కాదు. అయితే లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉం టుంది. కాబట్టి దీర్ఘకాల లక్ష్యాల కోసమే వీటిని ఎంచుకుంటే మంచిది. అమ్మాయిల కోసం సుకన్య సమృద్ధి యోజనతోపాటు, పీపీఎఫ్‌ ఖాతాలను తెరుచుకోవచ్చు. యులి ప్‌ ప్లాన్లలో ఎడిల్‌వీస్‌ టోక్యో, బజాజ్‌ అలియాంజ్‌, మ్యాక్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ టాప్‌లో ఉన్నాయి. ఎంఎఫ్‌ ప్లాన్లలో ఎస్బీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యూటీ ఐ, టాటా, ఎల్‌ఐసీ ముందున్నాయి.logo