బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 11, 2020 , 00:23:32

మహబూబ్‌నగర్‌లో బెనెల్లీ షోరూం

మహబూబ్‌నగర్‌లో బెనెల్లీ షోరూం

హైదరాబాద్‌, మార్చి 10: ఇటలీకి చెందిన సూపర్‌ బైకుల సంస్థ బెనెల్లీ..ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంలో భాగంగా సంస్థ మహబూబ్‌నగర్‌లో తన తొలి షోరూంను ప్రారంభించింది. దీంతో సంస్థ ఏర్పాటు చేసిన 27వ షోరూం ఇదే కావడం విశేషం. ఈ షోరూంలో బెనెల్లీకి చెందిన అన్ని రకాల బైకులు లభించనున్నాయి. వీటిలో ఇంపిరీయల్‌ 400, లియాన్‌సినో 250, టీఎన్‌టీ 300, సూపర్‌స్పోర్ట్‌ 302ఆర్‌ వంటి బైకులు  రూ.1.79 లక్షలు మొదలుకొని రూ.6.20 లక్షల లోపు ధరలో లభించనున్నాయి. ప్రీమియం ఆటోమోటివ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అన్ని రకాల బైకులు అందుబాటులో ఉంచినట్లు బెనెల్లీ ఇండియా ఎండీ వికాస్‌ తెలిపారు. ఈ బైకులపై ఐదేండ్ల వ్యారెంటీ సదుపాయం కూడా కల్పిస్తున్నది సంస్థ. 


logo
>>>>>>