టర్మ్ పాలసీతో ఎన్ని ప్రయోజనాలో..
బీమా పాలసీలు ప్రధానం రెండు రకాలు. మొదటిది కేవలం బీమా రక్షణ మాత్రమే ఇస్తుంది. అలాంటిదే టర్మ్ పాలసీ. రెండో రకం పాలసీలు బీమాతో పాటు పొదుపు, మదుపు లక్ష్యాలను కూడా నెరవేస్తాయి. ఈ పాలసీలు సర్వైవల్ బెనిఫిట్స్ కింద బీమా మొత్తాన్ని అందించడంతోపాటు, చెల్లించిన ప్రీమియంలపై రాబడిని కూడా అందిస్తాయి. టర్మ్ పాలసీలు కేవలం పాలసీదారు మరణిస్తేనే బీమా మొత్తం నామీనిలకు అందుతుంది. అయినప్పటికీ అత్యవసర సమయాల్లో సంప్రదాయ జీవిత బీమా పాలసీలకు తోడుగా అధిక బీమా రక్షణ ఉండే టర్మ్ పాలసీ కుటుంబానికి పెద్ద రక్షణ కవచంలా నిలుస్తుంది.
అర్థం చేసుకోవడానికి ఇది చాలా సింపుల్ పాలసీ. దీన్ని తీసుకున్న కుటుంబ పెద్ద అకస్మాత్తుగా చనిపోతే బీమా మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ కాలపరిమితి ముగిసేలోగా మరణించకపోతే మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదీ ఉండదు. అయితే, బీమా రంగంలో ఉన్న పోటీ దృష్ట్యా, కొన్ని కంపెనీలు ప్రత్యేక టర్మ్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో మెచ్యూరిటీ తర్వాత చెల్లించిన ప్రీమియంలను తిరిగి పొందవచ్చు. సాధారణ పాలసీల కన్నా ఎకువ బీమా మొత్తానికి అతి తకువ ప్రీమియం ఉంటుంది. అయితే ఫీచర్స్‌ని బట్టి ప్రీమియంలో తేడాలుంటాయి.
ఈ పాలసీలో కేవలం భద్రత మాత్రమే ఉంటుంది. మరణ సమయంలో మాత్రమే బీమా మొత్తాన్ని అందిస్తారు. ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్స్ ఉండవు. 30 ఏండ్ల వ్యక్తి 40 ఏండ్ల కాలపరిమితితో కోటి రూపాయలకు పాలసీని తీసుకుంటే వార్షిక ప్రీమియం కింద దాదాపు రూ.11,200 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రీమియం తిరిగి చెల్లింపు
రెగ్యులర్ పాలసీ మాదిరిగానే మరణ సమయంలో బీమా మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. మరణం సంభవించకపోతే.. చెల్లించిన ప్రీమియంలను మెచ్యూరిటీ సమయంలో తిరిగి చెల్లిస్తారు. ఈ పాలసీకి ప్రీమియం ఎకువే. 30 ఏండ్ల వ్యక్తి 40 ఏండ్ల కాలపరిమితితో కోటి రూపాయలకు పాలసీ తీసుకుంటే దాదాపు రూ.18,000 వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
వాయిదాల్లో బీమా మొత్తం చెల్లింపు
ఒకవేళ బీమా తీసుకున్న వ్యక్తి చనిపోతే.. డెత్ బెనిఫిట్ కింద నామినీకి పాక్షిక మొత్తాన్ని చెల్లించి, మిగతా మొత్తాన్ని 10 నుంచి 20 ఏండ్ల పాటు చెల్లిస్తారు. కోటి రూపాయల పాలసీలో మొదట 10 లక్షలు చెల్లించి ఆ తర్వాత ప్రతి నెలా రూ. 50,000 వరకు 15 ఏండ్ల పాటు పొందవచ్చు. ఈ పాలసీకి వార్షిక ప్రీమియం దాదాపు రూ.16,000 ఉంటుంది.
సింగిల్ ప్రీమియం
టర్మ్ పాలసీ వార్షిక ప్రీమియంను గడువులోగా చెల్లించకపోతే పాలసీ రద్దు అవుతుంది. ప్రీమియం గడువు కూడా సాంప్రదాయ జీవిత బీమా పాలసీల కన్నా తకువగా ఉంటుంది. అందుకని ప్రతి ఏటా చెల్లించడానికి బదులుగా ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించే వీలు ఈ తరహా పాలసీలో ఉంటుంది. ఇలాంటి పాలసీల్లో టర్మ్ 85 ఏండ్ల వరకు ఉంటుంది.
బీమా మొత్తంలో మార్పులు
పేరుకు తగ్గట్టుగానే బీమా మొత్తానికి మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. బీమా మొత్తాన్ని పెంచడం లేదా తగ్గించడం పాలసీ టర్మ్‌లో చేసుకోవచ్చు. అయితే ప్రీమియంలో మార్పులు పెద్దగా ఉండవు. సాధారణంగా ప్రీమియం ఎకువగానే ఉంటుంది.