గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 24, 2020 , 02:21:32

నగదీకరణపై భద్రం

నగదీకరణపై భద్రం

  • ఆర్బీఐని హెచ్చరించిన రఘురామ్‌ రాజన్‌

ముంబై, జూలై 23: నగదీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)ను రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లకు ఆర్బీఐ దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఆర్బీఐ తమ బ్యాలెన్స్‌ షీట్‌ను విస్తరిస్తూ పోతున్నది. ప్రభుత్వ రుణాలను కొంటున్నది. కానీ ఈ ప్రక్రియలో రివర్స్‌ రెపో రేటు వద్ద బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నది. తిరిగి ప్రభుత్వానికి రుణాల రూపంలో అందిస్తున్నది’ అని అన్నారు. అయితే ఇది భారంగా పరిణమించే ప్రమాదం ఉందని చెప్పారు. సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంక్‌ గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ మాట్లాడారు.

 నిజానికి గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థలను తిరిగి పట్టాలెక్కించేందుకు అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లోని సెంట్రల్‌ బ్యాంక్‌లు ఇప్పుడు ఈ తరహా వ్యూహాలనే అమలు చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ అప్రమత్తత అవసరమన్నారు. నగదీకరణకూ పరిమితులుంటాయని, దీన్ని ఎక్కువకాలం కొనసాగించడం మంచిది కాదన్నారు. భారత్‌ వంటి దేశాల రుణ భారం జీడీపీ నిష్పత్తిలో భారీగా పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలు బలహీనపడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరిన్ని విపరీతాలు జరుగవచ్చన్నారు.  


logo