సోమవారం 01 జూన్ 2020
Business - Apr 23, 2020 , 00:47:41

ఒడిదుడుకుల్లోనే..

ఒడిదుడుకుల్లోనే..

సింగపూర్‌: అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతున్నది. బుధవారం రాత్రి బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర తీవ్ర ఒడిదుడుకుల మధ్య 10 శాతానికిపైగా పడిపోయి 20 డాలర్లకు చేరింది. మరోవైపు జూన్‌ డెలివరికిగాను అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ ఫ్యూచర్‌ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడ్‌ ధర 14.45 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మధ్యాహ్నంతో పోల్చితే 3 డాలర్ల మేర పెరిగింది. లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం క్షీణించింది. దీంతో ముడి చమురుకు డిమాండ్‌ కనిపించడం లేదు. ఇప్పటికే ఒపెక్‌ దేశాలు తమ ఉత్పత్తికి కోత పెడుతామని ప్రకటించాయి.


logo