e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News 30 వ‌ర‌కు 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే?!

30 వ‌ర‌కు 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే?!

30 వ‌ర‌కు 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే?!

ముంబై: నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జరిపేవారు ఆయా బ్యాంకుల ప‌ని దినాల్లో మాత్ర‌మే పూర్తి చేసుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ నెల 25 నుంచి 30 వ‌ర‌కు నాలుగు రోజులు సెల‌వులు ఉన్నాయి.

క‌నుక మీరు బ్యాంకులో ఏదైనా ముఖ్య‌మైన ప‌ని ఉంటే పూర్తి చేసుకోవాల‌ని భావిస్తే, ముందుగా ఆయా బ్యాంకుల సెల‌వు దినాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి. అందుకు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళితే ఏ నెల‌లో ఏయే రోజుల్లో సెల‌వులు ఉన్నాయో తెలుస్తుంది.

- Advertisement -

బ్యాంకుల ప‌ని దినాల‌ను బ‌ట్టి మీరు మీ బ్యాంకు శాఖ‌కు వెళ్లి లావాదేవీలు పూర్తి చేసుకోవ‌చ్చు. ఆర్బీఐ హాలీడే క్యాలెండ‌ర్ ప్ర‌కారం జూన్‌లో తొమ్మిది రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు. రాష్ట్రాల వారీగా విభిన్నంగా ఉండొచ్చు. ఈ నెల 25-30 మ‌ధ్య నాలుగు రోజుల సెల‌వుల్లో రెండు పండుగ‌లు ఉన్నాయి.

ఈ నెల 25న గురు హ‌ర్‌గోవింద్ జీ జ‌యంతి.. జ‌మ్ముక‌శ్మీర్ వాసులు సెల‌బ్రేట్ చేసుకుంటారు. 30న మిజోరంలోని ఐజ్వాల్‌లో రెమ్నానీ సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు. 26న నాలుగో శ‌నివారం, 27న ఆదివారం బ్యాంకుల‌కు సెల‌వు.

నోటిఫైడ్ సెల‌వు దినాల్లో ప్ర‌భుత్వ, ప్రైవేట్‌, ప్రాంతీయ‌, విదేశీ బ్యాంకులు ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు. అయితే, ఖాతాదారులు మొబైల్, ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల‌తోపాటు వివిధ ర‌కాల ఆన్‌లైన్ మోడ్‌ల‌లో లావాదేవీలు జ‌రుపుకోవ‌చ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
30 వ‌ర‌కు 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే?!
30 వ‌ర‌కు 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే?!
30 వ‌ర‌కు 4 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎందుకంటే?!

ట్రెండింగ్‌

Advertisement