e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News 21 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎందుకంటే?!

21 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎందుకంటే?!

21 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎందుకంటే?!

న్యూఢిల్లీ: మీరు బ్యాంకులో ప‌ని నిమిత్తం వెళుతున్నారా.. అయితే ఆయా బ్యాంకుల‌కు సెల‌వు దినాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మీ బ్యాంకు శాఖ‌ల‌ను సంద‌ర్శించండి. ఎందుకంటే వారాంత‌పు సెల‌వులు, పండుగ‌ల నేప‌థ్యంలో శ‌నివారం నుంచి ఐదు రోజులు బ్యాంకులు ప‌ని చేయ‌వు. .

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలీడే క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఈ నెల‌లో 15 రోజులూ సెల‌వులే. శ‌నివారం నుంచి ఐదు రోజుల పాటు ప‌ని దినాల‌కు బ్రేక్ రావ‌డంతో కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు ఉద్యోగులు సెల‌వుల‌ను స‌ర‌దా గ‌డుప‌నున్నారు.

- Advertisement -

డెహ్రాడూన్‌లో శుక్ర‌వారం (జూలై 16) నాడు హ‌రేలా పూజ సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌లేదు.శ‌నివారం అగ‌ర్త‌ల‌లో యూ టిరోట్ సింగ్ డే, షిల్లాంగ్‌లో ఖ‌ర్చీ పూజ సంద‌ర్భంగా బ్యాంకులు మూసే ఉంటాయి.

ఆదివారం కావ‌డంతో ఈ నెల 18న సెల‌వు. జూలై 19న గ్యాంగ్‌ట‌క్‌లో గురు రింపొచే థుంగ్కార్ టెచు ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఇక బ‌క్రీద్ కార‌ణంగా ఈ నెల 20న జ‌మ్ము, కొచ్చి, శ్రీ‌న‌గ‌ర్‌, తిరువ‌నంత‌పురంల‌లో బ్యాంకుల‌కు హాలీడే.

ఈద్ అల్ అదా సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా బ్యాంకుల‌కు 21న సెల‌వు. అయితే, ఐజ్వాల్, భువ‌నేశ్వ‌ర్‌, గ్యాంగ్‌ట‌క్‌, కొచ్చి, తిరువ‌నంత‌పురంల‌లో బ్యాంకులు బుధ‌వారం తెరిచే ఉంటాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
21 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎందుకంటే?!
21 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎందుకంటే?!
21 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎందుకంటే?!

ట్రెండింగ్‌

Advertisement