సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Aug 04, 2020 , 00:37:16

బీవోఐ లాభం రూ.844 కోట్లు

బీవోఐ లాభం రూ.844 కోట్లు

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో రూ.844 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ.243 కోట్ల లాభాన్నే అందుకున్నట్లు సోమవారం తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో మాత్రం రూ.3,571 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ ఏప్రిల్‌-జూన్‌లో బ్యాంక్‌కు ఎన్నో పరిణామాలు కలిసొచ్చాయని బీవోఐ ఎండీ, సీఈవో ఏకే దాస్‌ ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు.logo