ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 11, 2020 , 02:33:48

బీవోబీ నష్టం 864 కోట్లు

బీవోబీ నష్టం 864 కోట్లు

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గత త్రైమాసికానికిగాను రూ.864 కోట్ల నష్టం సంభవించినట్లు తెలిపింది. క్రితం ఏడాది బ్యాంక్‌ రూ.710 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఎన్‌పీఏలను పూడ్చుకోవడానికి రూ.1,811 కోట్ల నిధులను వెచ్చించడం వల్లనే ఈసారి లాభాల్లో గండిపడిందని బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.38 శాతం తగ్గి రూ.18,494 కోట్లకు పరిమితమవగా, అంతక్రితం ఇది రూ.18,944 కోట్లుగా ఉన్నది. అయినప్పటికీ బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత ప్రమాణాలు మెరుగుపడినట్లు తెలిపింది. ముఖ్యంగా స్థూల నిరర్థక ఆస్తుల విలువ 10.28 శాతం నుంచి 9.39 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ కూడా 3.95 శాతం నుంచి 2.83 శాతానికి దిగొచ్చినట్లు వెల్లడించింది.


logo