గురువారం 28 జనవరి 2021
Business - Oct 30, 2020 , 00:43:38

బీవోబీ లాభం రెండింతలు

బీవోబీ లాభం రెండింతలు

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు లాభాలపంట పండింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.1,678 కోట్ల లాభాన్ని గడించింది. గతేడాది ఆర్జించిన రూ.736.70 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది. మొండి బకాయిలకోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, నికర వడ్డీ మార్జిన్‌ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైనట్లు తెలిపింది. సమీక్షకాలంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.9 శాతం పెరిగి రూ.7,507.50 కోట్లకు ఎగబాకింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.3 వేల కోట్ల నిధులను వెచ్చించింది. 


logo